ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ తీరప్రాంతంలో చెత్త ఏరిన విద్యార్థులు - vishaka

ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా విశాఖ సాగరతీరంలో పలువురు విద్యార్థులు తీర ప్రాంతంలో ఉన్న చెత్తను ఏరివేశారు.

విశాఖ తీరప్రాంతంలో చెత్త ఏరిన విద్యార్థులు

By

Published : Jun 8, 2019, 3:18 PM IST


విశాఖ సాగరతీరంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం పట్ల అసహనం చెందిన పలువురు విద్యార్థులు తీర ప్రాంతంలో ఉన్న చెత్తను ఏరివేశారు. విశాఖ సాగరతీరానికి నిత్యం అనేక మంది పర్యాటకులు వస్తున్నారని వారు వాడి పారేసే ప్లాస్టీక్, ఇతర వ్యర్ధాల కారణంగా సముద్రాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు సాగరతీరంలో పేరుకుపోయిన చెత్తను ఏరివేశారు.
నీటిలో జీవించే జీవరాశులు ప్లాస్టిక్ వ్యర్ధాలను తిని ప్రాణాలను కోల్పోతున్నాయని విద్యార్థులు అన్నారు. స్వచ్ఛ నగరాల జాబితాలో 3వ స్థానంలో ఉండే విశాఖ ఈ ఏడాది చాలా కింది స్థాయికి పడిపోవడం చాలా బాధాకర విషయమని వాపోయారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విశాఖ నగరంతో పాటు సముద్రాన్ని, తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు

విశాఖ తీరప్రాంతంలో చెత్త ఏరిన విద్యార్థులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details