ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థుల సంబరాలు వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ విడుదలపై ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు విశాఖలోహర్షం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం ఎదుట సంబరాలు చేశారు. భారత ప్రభుత్వం చూపించిన చొరవతో అభినందన్ విడుదల కావటం ఆనందంగా ఉందని విద్యార్థులు తెలిపారు. శత్రుదేశంలో కమాండర్ అభినందన్ చూపించిన ధైర్యసాహసాలు దేశమంతా ప్రశంసిస్తోందన్నారు. 'భారత్ మాతాకి జై'.. 'జై అభినందన్' అంటు నినాదాలు చేశారు. సంబరాల్లోపోలీసులు పాల్గొన్నారు.