ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ భూఅక్రమాలపై ఫిర్యాదుకు మరో అవకాశం

విశాఖ భూ అక్రమాలపై ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలకు సిట్ మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 21, 22న sit19suggest@gmail.comకు సూచనలు పంపాలని సిట్ అధిపతి విజయ్‌ కుమార్ కోరారు.

By

Published : Nov 20, 2020, 6:43 PM IST

Published : Nov 20, 2020, 6:43 PM IST

SIT on land scam in Visakhapatnam
SIT on land scam in Visakhapatnam

విశాఖ భూ అక్రమాలపై మెయిల్ ద్వారా సూచనలను సిట్‌ ఆహ్వానించింది. ఈ నెల 21, 22న sit19suggest@gmail.comకు సూచనలు పంపాలని సిట్ అధిపతి విజయ్‌ కుమార్ కోరారు. ప్రభుత్వ భూమి మార్పు, వెబ్‌ల్యాండ్‌లో మార్పులు, చేర్పులతో పాటు మాజీ సైనికులు, రాజకీయ బాధితుల ఎన్‌వోసీల జారీపై సూచనలను సిట్‌ కోరింది.

ప్రభుత్వ భూముల అక్రమణ, కబ్జాలపై ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలిపేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. గతేడాది నవంబరులో వ్యక్తిగత ఫిర్యాదులు స్వీకరించామన్న సిట్‌ అధిపతి విజయ్‌కుమార్... మెయిల్‌ ద్వారా పంపే సూచనలు, సలహాలు క్లుప్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details