రాష్ట్రానికి విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన సమితి...ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తోంది. సాధన సమితి సభ్యులకుదీక్షా శిబిరంలో కేజీహెచ్ వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. రాష్ట్రానికి కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్, విభజన హామీలు నెరవేర్చాలని సాధన సమితి జేఏసీ ఛైర్మన్ చలసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు .
పోరాటం కొనసాగిస్తాం - చలసాని శ్రీనివాస్
రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు నిరవేర్చాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ప్రత్యేక హోదా సాధన సమితి నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మరింతగా తమ పోరాట పటిమను చూపిస్తామని చలసాని శ్రీనివాస్ తెలిపారు.
ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తోన్న ప్రత్యేక హోదా సాధన సమితి