ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAIN: విశాఖలో గులాబ్ ఎఫెక్ట్.. భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం

గులాబ్ తుఫాను ప్రభావంతో విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరగటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి వేంటనే చర్యలు చేపట్టారు.

rain in vishakha district
rain in vishakha district

By

Published : Sep 27, 2021, 9:46 AM IST

విశాఖ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షానికి లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. పెందుర్తి కాలనీల్లోకి వరద నీరు చేరింది. పొలాల్లోని నీటిని తొలగించేందుకు అన్నదాతల అవస్థలు పడుతున్నారు. వేపగుంట అప్పలనర్సయ్య కాలనీలో ఓ మహిళ గోడ కూలి మృతి చెందింది. పలు చోట్ల రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

చోడవరంలో..

చోడవరంలో 24 గంటలలో 13 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాలాజీనగర్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.

పాడేరులో..

విశాఖ పాడేరు ఏజెన్సీలో గులాబ్ తుపాన్ ప్రభావంతో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. మత్స్య గడ్డ పొంగి ప్రవహిస్తోంది. హుకుంపేట మండలం వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:HEAVY RAINS: గులాబ్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు

ABOUT THE AUTHOR

...view details