సమావేశంలో మాట్లాడుతున్న రఘవీరారెడ్డి ప్రధాని సభకు మాత్రమే భద్రత ఇచ్చి... తమకు మాత్రం నిరాకరించడం ఏంటని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విశాఖపట్నం పోలీసులను ప్రశ్నించారు.శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖలో ప్రత్యేక హోదా భరోసా యాత్ర సందర్భంగా బహిరంగ సభను నిర్వహించాల్సి ఉన్నా... పోలీసులు అనుమతించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి భద్రత కల్పించే సామర్థ్యం లేదా అని విశాఖలోఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధాని విశాఖ రాకకు వ్యతిరేకంగా నినాదాలు తెలిపిన వారిని అభినందించారు. తాము అధికారంలోకి వస్తే విభజన హామీలు తీర్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.