ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఇన్​పై పోలీసులు దాడి...అదుపులోకి అనుమానితులు - visakha police

విశాఖ అల్లిపురం కూడలిలో ఉన్న విశాఖ ఇన్ హోటల్​ను పోలీసులు సీజ్ చేశారు. హోటల్​లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు ..అనుమానితులైన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని డీసీపీ రంగారెడ్డి హెచ్చరించారు.

విశాఖ ఇన్​పై పోలీసులు దాడి...అదుపులోకి అనుమానితులు

By

Published : Aug 25, 2019, 12:00 AM IST

Updated : Aug 25, 2019, 5:29 AM IST

విశాఖ ఇన్​పై పోలీసులు దాడి...అదుపులోకి అనుమానితులు
విశాఖ అల్లిపురం కూడలిలో ఉన్న విశాఖ ఇన్ హోటల్​లో రెండో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హోటల్​లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో డీసీపీ, మహారాణి పేట ఎమ్మార్వో ఆధ్వర్యంలో తూర్పు ఏసీపీ నేతృత్వంలో హోటల్​పై దాడులు చేశారు. హోటల్​లో ముంబయి, గుజరాత్​కు చెందిన ఇద్దరు యువతులు అనుమానంగా కనిపించడం వలన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్​కు సంబంధించిన కంప్యూటర్, ల్యాప్ టాప్ , హార్డ్ డిస్క్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హోటల్ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధరణ అయిన అనంతరం హోటల్​ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నగరంలోని కొన్ని స్పా సెంటర్లపై ఫిర్యాదులొచ్చాయన్న పోలీసులు.. స్పా యజమానులను పిలిపించి తగు సూచనలు చేశామన్నారు. స్పా సెంటర్లలో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

Last Updated : Aug 25, 2019, 5:29 AM IST

ABOUT THE AUTHOR

...view details