ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

couple death case: 'భార్యను హత్య చేసి.. భర్త ఉరివేసుకున్నట్టు భావిస్తున్నాం' - husband and wife died at vishaka

విశాఖలో కుమార్తె వివాహం జరుగుతుండగా తల్లిదండ్రులు మృతి ఘటనలో.. భర్త జగన్నాథరావే భార్యను హత్య చేసి ఉంటాడని సీఐ రమణయ్య అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

couple death at vishakha
విశాఖలో పెళ్లింట్లో విషాదం

By

Published : Aug 27, 2021, 7:52 PM IST

జగన్నాథరావే భార్యను హత్య చేసి తానూ ఉరివేసుకున్నట్టు భావిస్తున్నాం

ఈ నెల26న తెల్లవారుజామున విశాఖలో పెళ్లింట్లో విషాదం నెలకొన్న ఘటనలో పోలీసులు అదనపు సమాచారాన్ని ఇచ్చారు. 'పెళ్లిరోజు భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో తల్లి విజయలక్ష్మిని ఇంటికి తీసుకెళ్లాలని తండ్రిని పెళ్లికుమార్తె కోరింది. దీంతో జగన్నాథరావు తన భార్యను భానునగర్‌లోని ఇంటికి వెళ్లిపోయారు. కాసేపటికి తరువాత బంధువులు వెళ్లి చూడగా.. వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. జగన్నాథరావే భార్యను హత్య చేసి తానూ ఉరివేసుకున్నట్టు భావిస్తున్నాం. విజయలక్ష్మి 15 ఏళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం' అని చేపట్టినట్లు సీఐ రమణయ్య తెలిపారు.

ఇదీ చదవండి..

కుమార్తె వివాహం జరుగుతుండగా.. ఇంటికి వెళ్లిన తల్లిదండ్రులు ఏమయ్యారు..

ABOUT THE AUTHOR

...view details