ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Petrol Prices: రాష్ట్రంలో సెంచరీ దాటిన పెట్రోల్ ధరలు - ap latest news

రాష్ట్రంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి. విశాఖ, కడప మినహా అన్ని జిల్లాల్లో లీటర్ ధర.. వంద రూపాయలకు చేరింది.

petrol prices in andhrapradesh
petrol prices in andhrapradesh

By

Published : Jun 4, 2021, 3:32 PM IST

రాష్ట్రంలో పెట్రోల్‌ బాదుడు సెంచరీల మోత మోగించింది. విశాఖ, కడప మినహా మిగతా అన్ని జిల్లాల్లో లీటరు పెట్రోలు ధర..వంద రూపాయలకు చేరింది. అనంతపురంలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల 80 పైసలు, చిత్తూరు జిల్లాలో 101 రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో వంద రూపాయల 23 పైసలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నూటొక్క రూపాయల 23 పైసలకు పెరిగింది.

ఇక కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల 70 పైసలు, గుంటూరు జిల్లాలో వంద రూపాయల 89 పైసలు, కర్నూలు జిల్లాలో నూటొక్క రూపాయల 3 పైసలు, నెల్లూరు జిల్లాలో వంద రూపాయల 30 పైసలు, శ్రీకాకుళం జిల్లాలో వంద రూపాయల 68 పైసలు, విజయనగరం జిల్లాలో వంద రూపాయల 4 పైసలకు పెరిగింది. ప్రకాశం జిల్లాలో వంద రూపాయల 67 పైసలకు చేరింది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల 89 పైసలుగా ఉంది. విశాఖ జిల్లాలో లీటర్ పెట్రోల్‌ 99 రూపాయల 90 పైసలు, కడప జిల్లాలో 99 రూపాయల 93పైసలుగా ఉంది. ఇవాళ విశాఖ జిల్లాలో లీటర్‌ పెట్రోలుపై 19 పైసలు, కడపలో 17 పైసలు తగ్గించడంతో.. ఆ రెండు జిల్లాల్లో మాత్రమే పెట్రోలు ధర వంద దిగువన ఉంది.

ఇదీ చదవండి:

Amul Pala Velluva: పశ్చిమగోదావరిలో 'అమూల్ పాల వెల్లువ' ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details