ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బకాయిలు వెంటనే విడుదల చేయండి' - cab owners

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా అధికారులు కార్లు అద్దెకు తీసుకున్నారు. ఎన్నికలు జరిగి ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అద్దె చెల్లించకపోవడంతో ఆన్​లైన్​ క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5వ రోజుకు చేరిన ఆన్లైన్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్ల సంఘం ఆందోళన

By

Published : Sep 7, 2019, 7:52 PM IST

5వ రోజుకు చేరిన ఆన్లైన్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్ల సంఘం ఆందోళన

విశాఖలో ఆన్​లైన్​ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్ల సంఘం చేపట్టిన ఆందోళన 5వ రోజుకు చేరింది. ఎన్నికల సమయంలో జిల్లా అధికారులు తమకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. ఈ ఆందోళన చేస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో తమ కార్లను అద్దెకు తీసుకున్న జిల్లా అధికారులు...ఇప్పటికీ అద్దె చెల్లించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్​కు స్పందనలో పలుమార్లు తమ సమస్యలు విన్నవించినాఎటువంటి భరోసా రాలేదంటున్నారు.గత ఐదు నెలల నుంచి వాహనాలకు ఫైనాన్స్​ కట్టలేకపోతున్నామని.. కొన్ని కార్లను ఫైనాన్షియర్లు తీసుకెళ్లిపోయారని వాపోయారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి తమకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details