సాంకేతిక విద్యా విధానానికి నెలవైన కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. విశాఖలో ఉన్న అన్ని కేంద్రీయ విద్యాలయాల్లోనూ ఒకటో తరగతికి నేటి నుంచి ఈ నెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వాల్తేర్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ ఎస్.ఎస్. రాజా తెలిపారు.
2 నుంచి 10వ తరగతి వరకు ఖాళీలు ఉన్న చోట మాత్రమే అభ్యర్థులను ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కె.వి. హెడ్ క్వార్టర్ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన లింకు ఇచ్చినట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా ఎవ్వరూ పాఠశాలకు నేరుగా రాకుండా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకోవాలని ఆసక్తి కనబరిచే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజా అన్నారు.