మోదీ పర్యటనకు నిరసనగా ఆందోళనలు విశాఖలో ప్రధానిమోదీ పర్యటనకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఉద్యోగ సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, చలసాని శ్రీనివాస్ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సహా కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్నువిశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్చేశారు. కేంద్రం నెరవేర్చని విభజన హామీలను పోరాటం చేసి సాధిస్తామని స్పష్టం చేశారు.