విశాఖ కేజీహెచ్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులతో తిరిగి ప్రారంభించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించే వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 5 రూపాయలకే భోజనం పెడతానని స్పష్టం చేశారు. పేదవారి ఆకలిపై రాజకీయం తగదని ఆయన హితవు పలికారు.
విశాఖలో ఎమ్మెల్యే సొంత నిధులతో.. అన్న క్యాంటీన్ - vishakha
పేదవారి భోజనంపై రాజకీయం తగదని తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. విశాఖ కేజీహెచ్ సమీపంలోని అన్న క్యాంటీన్...తన సొంత నిధులతో తిరిగి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు సమయానికి భోజనం లేక కడుపు మాడ్చుకుంటున్నారని...ఇన్ని రోజులు వారి ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను మూసివేయటం సరి కాదన్నారు.
ఎమ్మెల్యే సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ప్రారంభం
పులిహోర, అన్నం, సాంబారు, కూర, పచ్చడి, పెరుగుతో కూడిన భోజనాన్ని ఎమ్మెల్యే గణేష్ కుమార్ పేద ప్రజలకు అందజేశారు. వివిధ సమస్యలతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైద్యసేవల నిమిత్తం కేజీహెచ్‌కు వచ్చేవారికి ఈ అన్న క్యాంటీన్ భోజనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఇవీ చూడండి-అన్న క్యాంటీన్లు కొనసాగించాలంటూ తెదేపా నేతల నిరసన