రాజధాని విషయంలో భాజపాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని.. ఆ పార్టీకి విలువలు లేకుండా పోవడానికి అదే ఆధారమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రూ.లక్షా 9 వేల కోట్లు ఇస్తే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరుతో రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు. విశాఖలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ చంద్రబాబు, పవన్, కన్నా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారన్నారు. నిజమైన రైతులు దాడులు చేసే పరిస్థితి ఉండదని.. భూములు ఇవ్వమంటూ గతంలో రైతులు పోరాటం చేసిన విషయం మర్చిపోకూడదన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకు అలవాటుపడి పవన్ అలా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము ప్యాకేజీ ఇచ్చినా తమకు అనుకూలంగా పవన్ మాట్లాడతారని... అయితే తమకు అలాంటి అలవాటు లేదని అన్నారు.
మహిళల్ని వేరే ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు