ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేనూ మర్మోసెట్ కోతిని.. మీకోసమే విశాఖ వచ్చా! - విశాఖకు మర్మోసెట్ మంకిస్ న్యూస్

విశాఖ ఇందిరాగాంధీ జూ పార్క్​కు అతిథులు వచ్చాయండోయ్. అతిథులు అంటే మామూలువి కాదు. పక్క ఊరుకు చెందినవి అసలే కాదు. వేరే దేశం నుంచి వచ్చాయి. మనతో ఉండటానికి వచ్చాయి. వాటి అల్లరి అంతా ఇంతా కాదు. ఆ అతిథులను చూడగానే ముచ్చటేస్తుంది. మరి ఆ అల్లరి ఏంటో.. ఆ కథేంటో మనమూ చూద్దామా..!

marmoset monkey in vishaka zoo park
marmoset monkey in vishaka zoo park

By

Published : Mar 5, 2020, 7:27 PM IST

విశాఖ జూకు మార్మోసెట్​ కోతిని తీసుకొచ్చిన అధికారులు

నేను మర్మోసెట్​ కోతిని. విశాఖ ఇందిరా పార్క్​కు వచ్చా. ఇక్కడే ఉంటా. బ్రెజిల్, అమెరికా ప్రాంతాల్లో సంచరించే మా ఇద్దర్ని ఇక్కడకు తీసుకొచ్చారు. మేం కలకత్తాలో పెరిగాం.. ఇక్కడి జంతువులను కలకత్తాలోని అలీపోరి జూ కి ఇచ్చి.. మా ఇద్దరినీ ఇక్కడకు తీసుకొచ్చారు. మేం చేసే ధ్వనులంటే చాలా మందికి ఇష్టం. మాకు చెవులపై తెల్లని వెంట్రుకలు, ఉడుత శరీర ఆకృతి పోలి ఉంటుంది. మేం చాలా చురుకండోయ్. పండ్లు ఎక్కువగా తింటాం. చూసేందుకు చిన్న కోతి పిల్లల్లాగా కనిపిస్తాం. కానీ.. పెద్దవాళ్లమే. విశాఖలో మమ్మల్ని చూసి చాలా మంది ముచ్చటపడుతున్నారు. చూసేందుకు సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు.

23 కోతి జాతుల్లో మేం(మార్మోసెట్‌) ఒకటి. 20 సెంటీమీటర్ల పొడవు, ఎత్తు 19 సెంటీమీటర్లు మాత్రమే ఉంటాం. దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాం. చెట్లే మాకు ఇళ్లు. చిన్న పురుగులు, పండ్లు, ఆకులు వంటివి లాగించేస్తాం. మాకూ గ్యాంగులుంటాయి తెలుసా.. అందులో 3 నుంచి 15 మంది వరకూ ఉంటాం. మా జీవిత కాలం 12 ఏళ్లు. బరువు 260 గ్రాములు. గర్భస్థ కాలం 152 రోజులు.

ABOUT THE AUTHOR

...view details