ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎల్జీ పాలిమర్స్​కు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట - విశాఖ గ్యాస్ లీకేజీ తాజా వార్తలు

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఎన్జీటీ ప్రధాన ఆదేశాలను సవాలు చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సంస్థ డిపాజిట్ చేసిన 50 కోట్ల రూపాయలపై మధ్యంతర స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.

lg polymers
lg polymers

By

Published : Jun 26, 2020, 9:35 PM IST

Updated : Jun 26, 2020, 10:13 PM IST

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ఎన్జీటీ ఆదేశాల మేరకు ఎల్జీ పాలిమర్స్ డిపాజిట్ చేసిన రూ.50 కోట్ల పంపిణీపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి విచారణ వరకు స్టే కొనసాగుతుందంటూ.. ఎల్జీ పాలిమర్స్ తాజాగా దాఖలు చేసిన పిటిషన్​పై విచారణలో స్పష్టం చేసింది.

ఘటన తర్వాత వాస్తవాలు, సంబంధిత ధ్రువపత్రాలు, అనుబంధ పత్రాల సమర్పణకు కోర్టు అంగీకరించింది. తాజా పిటిషన్​పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గతంలో దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్​ను విచారిస్తామని వెల్లడించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

Last Updated : Jun 26, 2020, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details