ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా 'ఈనాడు'-పినాకిల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సంయుక్తంగా విశాఖ నగర వుడా బాలల ప్రాంగణంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కింగ్ జార్జి ఆస్పత్రి న్యూరాలజీ విభాగాధిపతి సత్య శ్రీనివాస్ హాజరయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ఒక మూత్ర పిండాన్ని దానంచేస్తే వ్యాధిగ్రస్తులను ప్రమాదకర పరిస్ధితి నుంచి కాపాడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూత్ర పిండాల సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలకు సంబంధించి చికిత్సా విధానాలు, మూత్ర పిండాల మార్పిడి తదితర అంశాలపై వైద్య నిపుణులు అవగాహన కలిగించారు. అనంతరం నెఫ్రాలజీ-మూత్ర పిండాల మార్పిడి నిపుణుడు డాక్టర్ కె.కళ్యాణ చక్రవర్తి మూత్ర పిండాల వ్యాధులతో బాధపడుతున్న వారి ప్రశ్నలకు సమాధానం చెప్పారు.