ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో కార్గిల్ విజయ్ దివస్ 'వాక్ థాన్' - vishakha coast gourd

కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని విశాఖలో వాక్ థాన్ నిర్వహించారు. కోస్ట్ గార్డ్, అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. అనంతరం బీచ్ పరిసర ప్రాంతాల్లో చెత్తను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

విశాఖలో కార్గిల్ విజయ్ దివాస్ 'వాక్ ధాన్'

By

Published : Jul 27, 2019, 5:24 PM IST

విశాఖలో కార్గిల్ విజయ్ దివాస్ 'వాక్ థాన్'

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా విశాఖ కోస్ట్ గార్డు, అక్షయపాత్ర పౌండేషన్ సంయుక్తంగా వాక్ థాన్ నిర్వహించాయి. బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని కోస్ట్ గార్డు డీఐజీ పీకే మిశ్రా ప్రారంభించారు. గీతం విశ్వవిద్యాలయం మేనేజ్​మెంట్ విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. వంద కిలోలకు పైగా వ్యర్ధాలను సేకరించారు. జీవీఎంసీ సిబ్బంది సాయంతో వాటిని అక్కడి నుంచి తరలించారు. కార్గిల్ విజయం అందరికీ గర్వకారణమని, అందులో అసువులు బాసిన ప్రతి ఒక్క సైనికుడికి దేశ ప్రజలందరూ రుణపడి ఉన్నారని డీఐజీ మిశ్రా అన్నారు. రక్షణ దళాల్లో సేవలందించేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details