విశాఖ స్టీల్ ప్లాంటు (VIZAG STEEL) ప్రైవేటీకరణ సరికాదని.. ఈ కర్మాగారం ఏంతో మంది భావోద్వేగాలతో ముడిపడి ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ విషయంలో మొదటినుంచి ఈ రోజు వరకు అదే స్టాండ్‌కు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, స్టీల్ ప్లాంటు నిర్వాసితులతో విశాఖపట్నంలో సమావేశమయమై వారితో చర్చించారు. త్వరలోనే అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఉక్కు పరిరక్షణ పోరాటంలో పాలుపంచుకుంటారని వెల్లడించారు. మాట తప్పం మడం తిప్పమని గొప్పలు చెప్పుకొనే నాయకులు.. పార్లమెంటులో ఒక మాట.. బయట మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
VIZAG STEEL: త్వరలోనే ఉక్కు పోరాటంలోకి పవన్ కల్యాణ్: నాదెండ్ల మనోహర్ - vizag steel
విశాఖ ఉక్కు (VIZAG STEEL) ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ నిర్వహించిన సమావేశంలో జనసేన పార్టీ తరఫున నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై తమ పార్టీ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.
janasena