అవినీతిపై పోరాటానికి మానసిక దారుఢ్యంతో పాటు శారీరక దారుఢ్యమూ అవసరమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలు మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోతే రౌడీలు, అవినీతిపరులే రాజ్యమేలుతారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, హరియాణా, మహారాష్ట్రకు చెందిన 16 మంది మల్లయోధుల్ని ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన సత్కరించారు.
గురు పరంపరతో అభ్యసించే యుద్ధ విద్యలు దేశానికి చాలా అవసరమని పవన్ అన్నారు. కుస్తీ, కర్రసాము వంటివాటిని ప్రోత్సహించాలని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రాచీన యుద్ధ విద్యల్ని ప్రోత్సహిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ప్రతి గ్రామం నుంచి మల్లయోధులు రావాలి. భారతదేశంలో బలమైన సమాజం పునర్నిర్మాణానికి తెలుగు వారూ కృషి చేయాలి’ అని పవన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెలో పుట్టిన కోడి రామ్మూర్తి నాయుడు ప్రఖ్యాత మల్లయోధుడిగా మారిన తీరును, ఆయన సాహసకృత్యాలను వివరించారు. అనంతరం మల్ల యోధులందరికీ శాలువా కప్పి వెండి హనుమంతుడి విగ్రహాలను బహూకరించారు. మల్లయోధుల బృందానికి ఓ గదను బహుమతిగా అందించారు.
విశాఖలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్