ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జగన్ గారూ...మీరిలా చేయడం బాగాలేదండి'

ఈ నెల వృద్ధాప్య పింఛన తేదిని ప్రభుత్వం మార్చటంతో వృద్ధులు ఆయా కేంద్రాలకు వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ...ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Jul 2, 2019, 6:12 AM IST

'జగన్ గారూ...మీరిలా చేయడం బాగాలేదండి'

విశాఖలో వృద్ధాప్య పింఛను అందుకుందామని వచ్చిన వృద్ధులు నిరాసతో వెనుదిరిగారు. ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు అందిస్తారు. ఈనెల నుంచి వృద్ధాప్య పింఛన్ల పేరును వైఎస్ఆర్ పింఛను కానుక పథకంగా ప్రభుత్వం మార్చింది. గత నెల వరకు ఇచ్చిన 2వేల రూపాయలకు అదనంగా మరో 250 రూపాయలను జత చేసి అందించనున్నారు. ఈ సందర్భంగా పింఛను అందజేత ప్రక్రియ తేదీని మార్చారు. పెంచిన పింఛన్లు మొత్తాన్ని వైఎస్ఆర్ జయంతి రోజైన జులై 8న ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బట్వాడా చేయడానికి ప్రభుత్వం ఆదేశించింది. పింఛన్ పంపిణీ తేదీ మార్పు సమాచారం వృద్ధులకు తెలియకపోవడంతో యథావిధిగా 1వ తేదీనే వారు ఆయా వార్డు కార్యాలయాలకు వచ్చారు. అయితే పింఛన్లు 8వ తేదీన ఇస్తారని తెలియడంతో వృద్ధులు తీవ్ర నిరాసతో వెనుదిరిగారు.

వృద్ధుల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details