విశాఖ నగరంలో ఓ సైకో కలకలం రేపాడు. అర్ధరాత్రి నగ్నంగా ఇళ్లల్లోకి ప్రవేశించాడు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ఇంట్లోకి ఓ దుండగుడు తలుపులు పగలగొట్టి చొరబడ్డాడని... బీరువాలోని 10 వేల రూపాయల నగదును తస్కరించాడని విశాఖలోని మర్రిపాలెం వుడా లేఅవుట్లో నివాసముంటున్న వ్యాపారి వడ్డాది త్రినాథరావు... కంచరపాలెం నేరవిభాగ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో ఆ ప్రాంతంలోని మరికొన్ని ఇళ్లల్లోనూ దొంగలు చొరబడ్డారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఓ ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. ఓ వ్యక్తి నగ్నంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు అందులో ఉంది. అయితే తమ విచారణలో ఆ వ్యక్తి సైకోగా తేలిందని పోలీసులు చెబుతున్నారు. అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.