ఇళ్ల కోసం.. గాంధీ విగ్రహం ముందు ఆందోళన - hegitation
విశాఖ నగరం 34వ వార్డు అల్లూరి సీతారామరాజు కాలనీలో.. ఇంటి నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు.
విశాఖ నగరం 34వ వార్డులో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న సుమారు 350 కుటుంబాలకు చెందిన పాకలను జీవీఎంసీ అధికారులు తొలగించి వాటి స్థానంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు. వారి హామీలను నమ్మిన కొందరు దూర ప్రాంతాలకు వెళ్లగా, మరికొందరు అక్కడే రోడ్డు పక్కన జీవిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండా, తాత్సారం చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారులు వసతి గృహాలు కల్పించి తమకు న్యాయం చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని హెచ్చరించారు.