విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. రోజువారీ పనుల నిమిత్తం సిబ్బందిని పరిశ్రమలోనికి అనుమతించాలని, విచారణ సమయంలో పోలీసులు తమ నుంచి తీసుకున్న ధ్రువపత్రాలను ఇప్పించాలని కోరుతూ... గతంలోనే పరిశ్రమ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రతివాదులు దాఖలు చేసిన కౌంటర్ ఇంకా అప్డేట్ కాకపోవటంతో తదుపరి విచారణను ఈనెల 11 వతేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పిటిషన్పై విచారణ వాయిదా - lg polymers latest news
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులు దాఖలు చేసిన కౌంటర్ అప్డేట్ కాకపోవటంతో తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.
ap high court