ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తొలిసారిగా విశాఖ పర్యటనకు గవర్నర్ - విశాఖ

బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గవర్నర్​ బిశ్వభూషన్ హరిచందన్ విశాఖ నగరంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.

governer_bishwabhushan_vishaka_tour_today_after_he_took_charges

By

Published : Jul 31, 2019, 4:15 AM IST

గవర్నర్​గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా విశాఖ పర్యటనకు గవర్నర్ బిశ్వభూషన్ వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళాన్ని సందర్శిస్తారు. తర్వాత ప్రభుత్వ అతిథి గృహంలో విడిది చేయనున్నారు. సాయంత్రం కైలాసగిరికి వెళ్లి తెలుగు మ్యూజియం తిలకిస్తారు. అనంతరం సెంట్రల్ పార్క్​ను పరిశీలిస్తారు. గురువారం నాడు ఆంధ్రవిశ్వవిద్యాలయం సందర్శించి అక్కడ రక్తదానం శిబిరం ప్రారంభిస్తారు. ఏయూ ఆధ్వర్యంలో గవర్నర్​కు ఛాన్స్​లర్ హోదాలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం విశాఖ పోర్టును సందర్శించి అక్కడి కార్యకలాపాలను తెలుసుకుంటారు. అదేరోజు రాత్రికి తిరిగి విజయవాడ రాజ్ భవన్​కి పయనమవుతారని రాజ్ భవన్ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ సమీక్షించారు.

తొలిసారిగా విశాఖ పర్యటనకు గవర్నర్

ABOUT THE AUTHOR

...view details