విశాఖ వన్ టౌన్‌లోని పురాతన దేవాలయం కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. గర్భాలయంలో అమ్మవారి మూలవిరాట్‌ను సుమారు రెండు కోట్ల రూపాయల కరెన్సీతో అలంకరించారు. అలాగే నాలుగు కేజీల స్వర్ణాభరణాలు, బంగారు చీర, కిరీటం, బిస్కెట్స్, సువర్ణ పుష్పాలను అలంకరణలో ఉపయోగించారు. సుమారు 200 మంది భక్తులు తమ సొమ్మును అమ్మవారికి అలంకరణ నిమిత్తం అందజేశారు. అలంకరణ అనంతరం వారి ధనాన్ని వారికీ అందజేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు. వీఎమ్ఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ...అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
విశాఖలో కరెన్సీ, బంగారంతో కన్యకాపరమేశ్వరి అమ్మవారు - vishakha
విశాఖలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారిని కరెన్సీ, బంగారంతో అలంకరించారు.
కరెన్సీ, స్వర్ణాలంకరణలో విశాఖ కన్యాకాపరమేశ్వరి అమ్మవారు