ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో ఘనంగా గాంధీ జయంతి.. స్వచ్ఛ భారత్​ కార్యక్రమం - gandhi jayanthi

మహాత్ముని జయంతిని పురస్కరించుకుని జీవీఎంసీ పపిధిలో ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్​ను నిషేధించారు. విశాఖ రైల్వే ప్రాంగణంలో గాంధీ విగ్రహంతో కూడిన చిత్ర, కళా ప్రదర్శన నిర్వహించారు.

విశాఖలో ఘనంగా గాంధీ జయంతి.. స్వచ్ఛ భారత్​ కార్యక్రమం

By

Published : Oct 2, 2019, 10:57 PM IST

విశాఖలో ఘనంగా గాంధీ జయంతి.. స్వచ్ఛ భారత్​ కార్యక్రమం

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా విశాఖ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ప్రత్యేక విగ్రహంతో కూడిన చిత్ర,కళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన, విగ్రహాన్ని వాల్తేర్ డిఆర్ఎం చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్ ప్రారంభించారు. విగ్రహానికి ఇరువైపులా గాంధీజీ స్వాతంత్య్ర పోరాటం, గాంధీజీ మరణానంతరం జరిగిన పలు కీలక ఘట్టాలను వివరిస్తూ ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారు. విగ్రహం కింద భాగంలో శాంతి ఆశ్రమ నమూనాను ఏర్పాటు చేశారు.

జీవీఎంసీ పరిధిలో గాంధీ జయంతి సందర్భంగా ఒకసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధిస్తున్నట్లు జోనల్ కమిషనర్ శ్రీనివాస రావు ప్రకటించారు. విశాఖ సీతమ్మధార రైతు బజార్ టెక్ మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగులు పంపిణీలో ఆయన పాల్గొన్నారు. స్టిక్ బ్యాగ్ వినియోగం చేసిన వారిపై వివిధ దశల్లో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గాంధీ జయంతి సందర్భంగా విశాఖ కోస్ట్ గార్డ్ నిర్వహిస్తున్న స్వచ్చతే సేవ కార్యక్రమం ముగింపు కార్యక్రమం ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో జరిగింది. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిలిపివేయాలని, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను అసలు వినియోగించరాదని గ్రామస్ధులకు కోస్ట్ గార్డు అధికారులు, సిబ్బంది వివరించారు 50 మంది అధికారులు, 150 సిబ్బంది కోస్ట్ గార్డు ప్రధాన కార్యాలయం ఆవరణాన్ని పరిశుభ్రం చేసే పని చేపట్టారు.

ఇవీ చూడండి-ప్లాస్టిక్ వద్దు... కాగితం సంచులే ముద్దు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details