ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

' కుర్చీ కోసమే ఫారం-7 కుట్ర' - గణబాబు

అధికారంలోకి రావాలనే కుట్రతో ఫామ్-7 దుర్వినియోగానికి వైకాపా పాల్పడుతోంది. ఈ కుట్రలకు ప్రతిఫలంగా మరోసారి ప్రతి పక్షనేతకు జైలు శిక్ష తప్పదు. - గణబాబు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే

విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు

By

Published : Mar 10, 2019, 1:51 AM IST

Updated : Mar 10, 2019, 10:16 AM IST

విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు
వైఎస్ జగన్​పై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కుట్రతో ఫామ్-7ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. జైలు జీవితం అనుభవించిన జగన్​కు ఓట్ల తొలగింపునకు పాల్పడిన కేసులో మళ్లీ శిక్ష తప్పద్దని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలతో మళ్లీ తెదేపానే అధికారంలోకి వస్తుందన్న భయం ప్రతిపక్ష నేతకు పట్టుకుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 6 వేల ఓట్లను గల్లంతు చేశారని.. దీనికి వైకాపా నేత మళ్ల విజయప్రసాద్ ముఖ్య కారకుడని గణబాబు ఆరోపించారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 10, 2019, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details