ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థుల ఆటపాటలతో దద్ధరిల్లిన ఆంధ్ర విశ్వవిద్యాలయం - visakhapatnam

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరిగిన ఫ్రెషర్స్‌డే  వేడుకలు ఘనంగా సాగాయి. కళాశాలకు కొత్తగా వచ్చే వారికి స్వాగతం పలుకుతూ సీనియర్లు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం ఆడీ పాడీ సందడి చేశారు.

au

By

Published : Sep 14, 2019, 7:19 AM IST

సందడిగా ఫ్రెషర్స్ డే వేడుకలు

కళాశాలకు కొత్తగా వచ్చే వారికి స్వాగతం పలుకుతూ వారిలో భయం తొలగించేందుకు సీనియర్ విద్యార్థులు సందడితో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం మార్మోగింది. ఎమ్​హెచ్​ఆర్​ఎమ్ విభాగంలో తొలి ఏడాది చేరిన వారికి సీనియర్లు ఘనస్వాగతం పలికారు. ఏయూ ప్లాటినం జూబిలీ అతిధిగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

మొదటి సంవత్సరం విద్యార్థులు స్వయంగా రూపొందించిన సినీనృత్య గీతాలు అందరిని అలరించాయి. హుషారైన పాటలకు అద్భుత స్టెప్పులతో అమ్మాయిలు అదరహో అనిపించారు. సీనియర్‌, జూనియర్‌ తేడా లేకుండా నృత్యాలు చేస్తూ హుషారుగా గడిపారు. కేవలం నృత్యాలకే పరిమితం కాకుండా ఆటా-పాటలతో ఆనందంగా గడిపారు. రకరకాల ఆటలు ఆడుతూ... విజేతలుగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలతో తమకు స్వాగతం పలకటంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం కల్పించిన ఆచార్యులకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

సంప్రదాయ దుస్తులు ధరించిన యువకులు పాత సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ చూపరులకు హాస్యం అందించారు. కేరింతలతో స్థానిక ప్రాంగణం దద్దరిల్లింది.ర్యాంగింగ్‌కు వ్యతిరేకంగా తాము జూనియర్లకు స్వాగతం పలికామని సీనియర్లు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details