ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఐదేళ్లుగా ఆ గ్రామంలో యోగా శిక్షణ ఉచితం - TRAINING

ఒంటిని ఇంద్రధనస్సులా మెలికలు తిప్పగలరు. ఎంతో క్లిష్టతరమైన యోగాసనాలను అవలీలగా వేసేస్తున్నారు విశాఖకు చెందిన బాలలు. కౌండిజ్ఞ ఆసనం, రాజకపోతాసనం, పూర్ణ హనుమాన్, చకోరాసనం, నమస్కారాసనం ఇలా ఏదైనా అలవోకగా చేసేస్తున్నారు.

యోగా

By

Published : Jun 21, 2019, 10:11 AM IST

ఐదేళ్లుగా ఆ గ్రామంలో యోగా శిక్షణ ఉచితం

భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ఇటీవల కాలంలో అన్ని స్థాయిల్లోనూ ప్రాధాన్యతను విస్తరించుకుంటోంది. విశాఖ శివార్లలో చింతలాగ్రహారంలో దాడి సురేశ్ అనే వ్యక్తి చిన్నారులకు 5సంవత్సరాల నుంచి ఉచితంగా యోగాను నేర్పిస్తున్నారు. శిక్షణ పొందిన వారు... జాతీయ, అంతర్జాతీయ స్థాయి యోగా పోటీల్లో పతకాలను సాధిస్తున్నారు. యూత్ ఒలంపిక్ అసోసియేషన్ వారు నిర్వహించిన యోగా పోటీల్లో 2 బంగారు పతకాలు, ఒక వెండి, ఒక కాంస్య పతకాలను సాధించారు. ఇవేకాక ఏసియన్ గేమ్స్ పోటీలకు అర్హత సాధించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్నాక తమకు అనారోగ్య సమస్యలు దూరమయ్యాయని గ్రామస్థులు అంటున్నారు.
నిత్యం తెల్లవారుజామున 5 గంటలు నుండి 7 గంటల వరకు , ప్రాణాయామంతో మొదలయ్యే సాధన, కనీసం 10 నుంచి 12 ఆసనాలకు తక్కువ కాకుండా సాధన చేస్తారు. బాలల నుంచి స్ఫూర్తి పొందిన మహిళలు... ఆరోగ్య పరమైన సమస్యల నివారణకు యోగా సాధన మొదలు పెట్టారు. పిల్లలు ఇప్పటివరకు దేశంలో జరిగిన వివిధ యోగాపోటీలలో సత్తా చాటారు. అంతర్జాతీయంగా పలు పోటీలకు హాజరై తమ విలక్షమైన ఆసనాల ద్వారా ప్రత్యేక గుర్తింపు సాధించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details