hetero wastewater pipeline news : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలో హెటిరో మందుల పరిశ్రమ వ్యర్థ జలాల పైప్ లైన్ నిర్మాణాన్ని స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. సముద్ర గర్భంలోకి గతంలో వేసిన చిన్న పైప్ లైన్ స్థానంలో భారీ పైపులు వేస్తుండడంతో తమ జీవనోపాధి దెబ్బతింటుందని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
hetero wastewater pipeline: హెటిరో వ్యర్థ జలాల పైప్ లైన్ నిర్మాణంపై మత్స్యకారుల ఆందోళన
hetero wastewater pipeline : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలో హెటిరో మందుల పరిశ్రమ నిర్మిస్తున్న వ్యర్థ జలాల పైప్ లైన్ నిర్మాణాన్ని స్థానిక మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై ఆందోళన చేపట్టారు.
Protest
ఐదు రోజులుగా శాంతియుత ధర్నా చేస్తున్నారు. అయినా అధికారుల, పరిశ్రమ వర్గాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సముద్ర తీర ప్రాంతం రాజయ్యపేట నుంచి నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని అంటున్నారు.
ఇది చదవండి:jawad effect on vishaka coast: విశాఖ తీరాన ‘అల’జడి!