ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం... భారీ క్రేన్ దగ్ధం - boat fire

విశాఖలో పోర్టు హార్బర్​లో జరిగిన అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో భారీ ప్రమాదం జరిగింది. సీపోల్ పోర్టు కంపెనీకి చెందిన హార్బర్ మెబైల్ క్రేన్ హెచ్​ఎంసీలో ప్రమాదం సంభవించి... భారీ క్రేన్ దగ్ధమైంది

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం... భారీ క్రేన్ దగ్ధం

By

Published : Aug 26, 2019, 9:07 PM IST

విశాఖ పోర్టులో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డబ్ల్యూ క్యూ 1 బెర్త్ వద్ద ఉన్న భారీ క్రేన్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది విభాగం మంటలను అదుపుచేసే చర్యలను చేపట్టినా క్రేన్ దగ్ధమైంది. సీపోల్ పోర్టు కంపెనీకి చెందిన హార్బర్ మెబైల్ క్రేన్ హెచ్ ఎంసీలో ఈ ప్రమాదం జరిగినట్టు పోర్టు వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని .... అగ్ని ప్రమాదం ఘటనపై వివరణను విడుదల చేసింది. సాయంత్రం ఈ ప్రమాదం జరిగినప్పటికీ వివరాలు బయటకు పొక్కకుండా పోర్టు వర్గాలు గుట్టుగా వ్యవహరించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం... భారీ క్రేన్ దగ్ధం

ABOUT THE AUTHOR

...view details