వినాయక చవితి సందర్భంగా విశాఖ అశీల్మెట్ట సంపత్ వినాయక దేవాలయం వద్ద తెల్లవారుఝాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఉష్ణోగ్రత, స్క్రీనింగ్, శానిటేషన్ వంటి జాగ్రత్తలు తీసుకుని.. బాగానే ఉన్నారని నిర్థారించుకున్నాకే దర్శనానికి అనుమతించారు. ప్రతి ఏటా ఇక్కడ వినాయక చవితి నవరాత్రి వేడుకలు భారీగా జరుగుతాయి. కానీ.. కరోనా వైరస్ దృష్ట్యా ఈ సారి అధికారులు ఉత్సవ నిర్వహణకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.
సంపత్ వినాయకుని ఆలయానికి భక్తుల తాకిడి - వినాయక చవితి 2020
అశీల్మెట్ట సంపత్ వినాయక దేవాలయానికి శనివారం భక్తులు దర్శించుకునేందుకు భారీగా వచ్చారు. కొవిడ్ నిబంధనలు ఉన్నప్పటికి వినాయక చవితి రోజు కావడం వల్ల భక్తుల రాక తగ్గలేదు. ఆలయ అధికారులు జాగ్రత్తలు పాటించి వారికి స్వామి వారి దర్శనాన్ని కల్పించారు.
అశీల్మెట్ట సంపత్ వినాయక దేవాలయం