కేంద్ర ప్రభుత్వ రాక్షస పాలనను అంతం చేసేందుకు భాజపా వ్యతిరేక శక్తులన్నీ ఓ వేదికగా తయారు కావడానికి సన్నద్ధమవుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 2023లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థిని గెలిపించటం ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన పతనానికి నాంది కానుందన్నారు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నాయన్నారు. చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీల అభ్యర్థిగా శరద్ పవార్‌ను బరిలో దించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ముందు రెండు సవాళ్లున్నాయన్నారు. అందులో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మెుదటిది కాగా, మరొకటి రాష్ట్రపతి ఎన్నికలన్నారు. ఆ రెండింటిలో పరాజయం ద్వారా భాజపా పాలన పతనం ప్రారంభమవుతుందన్నారు