ఆక్సిజన్ ప్లాంట్లు, లీకేజీలు, స్థితిగతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు నిర్వహణ బాధ్యతలు తీసుకునేందుకు ఈఎన్‌ఈ ముందుకొచ్చింది. దీనికోసం అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం మూడు నుంచి నాలుగు జిల్లాల్లో నిర్వహణా బాధ్యతలు పర్యవేక్షిస్తుంది. ఎక్కడ అవసరమైతే అక్కడకి ఈ బృందాలను వాయుమార్గంలో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయాలు, ఇతర ఇబ్బందులను నౌకాదళ బృందాలు పరిష్కరించనున్నాయి. ఆక్సిజన్ ప్లాంట్లలో తలెత్తిన సాంకేతిక లోపాలను సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం చేసేందుకు నౌకాదళం అంగీకరించింది.
సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియాల నుంచి రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్‌తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్‌ను తరలించేందుకు నౌకాదళం అంగీకరించింది. రోజువారీ అవసరాల కోసం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కంటైనర్స్‌ను తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చేందుకు నేవీ అధికారులు ఆమోదం తెలిపారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, డి-టైప్ ఆక్సిజన్ సిలిండర్లతోపాటు కొవిడ్ చికిత్సకు అవసరమైన ఇతర వైద్య పరికరాల సరఫరాకు నేవీ అధికారులు అంగీకారం తెలిపారు. ఐఎన్‌ఎస్ కళింగ ఆసుపత్రిలో 10 ఆక్సిజన్ బెడ్స్‌తో పాటు 60 పడకలను చికిత్స కోసం కేటాయించేందుకు తూర్పు నౌకాదళం అంగీకరించింది.
అదనంగా.. విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో 150 పడకల తాత్కాలిక ఆసుపత్రి కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సమ్మతించింది. ఇందుకు అవసరమైన వైద్యులు, పారా మెడికల్ స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 200 డి-టైప్ సిలిండర్ల అందించేందుకు నేవీ ముందుకొచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కొవిడ్ చికిత్స కోసం అదనపు పడకల ఏర్పాటుకు ముందుకొచ్చింది. 850 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన రెండు యూనిట్లుకు గాను కేవలం 100 మెట్రిక్ టన్నుల ఎంఎల్‌ఓ ఉత్పత్తి అవుతుందని స్టీల్ ప్లాంట్ అధికారులు తెలిపారు. 2013లో ఈ ప్లాంట్ పూర్తైనప్పటికీ... కాంట్రాక్టింగ్ ఏజెన్సీతో సంప్రదింపులు పూర్తి కాలేదని ఆర్‌ఏఎన్‌ఎల్ అధికారులు తెలిపారు.