ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ జిల్లాలో కొవిడ్ తగ్గుముఖం... రికవరీ రేటు 96.93 శాతం - విశాఖలో కరోనా కేసులు న్యూస్

విశాఖ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వేలలో నమోదైన కేసులు ఇప్పుడు వందల్లోకి వచ్చాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 58 వేలు దాటినా...రికవరీలు అదే స్థాయిలో ఉన్నాయి. మరణాల రేటు కూడా ఒక్క శాతంలోపే ఉండడం వల్ల వైద్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Covid cases
Covid cases

By

Published : Nov 20, 2020, 9:07 PM IST

విశాఖ జిల్లాలో కొవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకూ వేల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో కొవిడ్ మరణాల సంఖ్య 500కి చేరింది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 56,292గా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 1282గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 58074 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో రికవరీ రేటు 96.93 శాతం ఉండగా... యాక్టివ్ కేసుల రేటు 2.21గా చేరింది. కొవిడ్ బారిన పడి మృతి చెందినవారి రేటు 0.86 శాతంగా ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో నమోదైన కేసుల్లో జీవీఎంసీ పరిధిలోనే దాదాపు 90 శాతం కేసులు ఉన్నాయి. రికవరీ రేటు కూడా ఇక్కడే గరిష్టంగా ఉంది. విశాఖలో ప్రస్తుతం విమ్స్ అసుపత్రితో సహా, ఛాతీ ఆసుపత్రి, కేజీహెచ్​లోని సీఎస్ఆర్ బ్లాక్​లో కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గతంలో పూర్తి స్థాయిలో ప్రైవేటు ఆసుపత్రులను కొవిడ్ చికిత్స కోసం మాత్రమే నిర్దేశించారు. ఇప్పుడా నిబంధన సడలించి వాటిలో ఇతర రోగులకు చికిత్స అందించవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

విశాఖ జిల్లా గణాంకాలలో అత్యధిక కేసులు ఆగస్టు నెలలో రికార్డు అయ్యాయి. సెప్టెంబరు నెల నుంచి కేసుల నమోదు సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఎక్కువమందికి హోం ఐసొలేషన్​ సూచించడం కూడా కొవిడ్ ఆసుపత్రులపై ఒత్తిడిని తగ్గించింది.

ఇదీ చదవండి :రేపు నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details