విశాఖలోని కరోనా కేసుల పరీక్ష కోసం కేటాయించిన ఛాతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమి కనిపిస్తోంది. అక్కడికి పరీక్ష కోసం వచ్చిన ఓ వ్యక్తి వీడియోని తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఆ పరీక్ష కేంద్రంలో ఎవరూ లేకపోవడం, అత్యవసరమైనప్పుడు పనిచేసే సిబ్బంది లేని వైనం ఆ వీడియోలో కనిపిస్తోంది. అనుమానితుల నుంచి పరీక్షల కోసం రక్తాన్ని సేకరించిన తర్వాత.. ఆ సిరంజిలను కూడా అలానే వదిలేస్తున్నారు. అక్కడ రోగులకు సరఫరా చేసిన ఆహారం ఏ స్థితిలో ఉందో కళ్లకు కట్టినట్లు ఈ వీడియోలో ఉంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోపై జిల్లా కలెక్టర్ విజయ్ చంద్ స్పందించారు.
విశాఖ చెస్ట్ ఆస్పత్రి వీడియో వైరల్: నిజం కాదన్న కలెక్టర్
విశాఖలోని కరోనా కేసుల పరీక్ష కోసం నిర్దేశించిన ఛాతి ఆస్పత్రిలో సౌకర్యాల లేమి ఉందని సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతోంది. ఆస్పత్రికి పరీక్ష కోసం వచ్చిన ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి సామాజిక మాధ్యమంలో పెట్టడం కలకలం రేపింది.
collector-on-chest-hospital-facilities-in-vishaka
ఛాతి ఆస్పత్రిలో కేవలం అనుమానితుల కేసులు మాత్రమే పరీక్షకు వస్తాయని..వీడియోలో చూపించిన వార్డు అసలు దానికి సంబంధించిన వార్డు కాదని కలెక్టర్ తెలిపారు. అయితే ఏదైనా లోపాలు ఉంటే కచ్చితంగా సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇవీ చదవండి:తెలంగాణ: కరోనా రోగులను తరలించాక అంబులెన్స్ సిబ్బంది ఏం చేస్తారో తెలుసా..?