'అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదు' - politics
ఎన్నికల వేళ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. ఇదంతా సహజమని ఆమంచి, అవంతి శ్రీనివాస్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆమంచి, అవంతి పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.... పార్టీని అంటి పెట్టుకుని ఉండేది కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఆశయం కోసం పనిచేసేది వారేనని కితాబిచ్చారు. తనపై కుల ముద్ర వేయాలని చూడటం దారుణమని ఆక్షేపించారు. అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని, కొందరు పోతే జరిగే నష్టం కన్నా.. లాభాలే మిన్న అని వ్యాఖ్యానించారు. అవంతి శ్రీనివాస్ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదని తెదేపా నిర్ణయించింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమకు లాభం కలిగిస్తాయని భావిస్తున్నారు.