ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా సీఎం స్పందించరేం?'

రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు ధార్మిక సంస్థల ప్రతినిధి శ్రీనివాసానంద స్వామి. ఈ ఘటనలపై సీఎం జగన్ కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.

srinivasananda swami
srinivasananda swami

By

Published : Sep 16, 2020, 6:13 PM IST

శ్రీకాళహస్తి దేవాలయంలో శివలింగం, నంది విగ్రహాలను పెట్టి అపచారం చేసిన ఘటనపై ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన చెందారు ధార్మిక సంస్థల ప్రతినిధి శ్రీనివాసానంద స్వామి. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే సీఎం జగన్ కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. హిందూ దేవతా విగ్రహాలను అవమానించే చేష్టలు పెరుగుతున్నాయని... వెంటనే దీనిపై దేవదాయశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details