విశాఖలో పల్లా భవనాన్ని కూల్చివేయడాన్ని చంద్రబాబు ఖండించారు. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క మరణాలు పెరుగుతున్నాయన్నారు. వ్యాధి నిర్ధారణ ఫలితాలు కూడా సమయానికి ఇవ్వట్లేదని విమర్శించారు. ఆక్సిజన్, మందులు లేక.. వ్యాక్సిన్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు అన్నారు. సమస్యలు దారి మళ్లించేందుకే నిన్న ధూళిపాళ్లను అక్రమ అరెస్టు చేశారని.. ఇవాళ విశాఖలో పల్లా శ్రీనివాసరావు ఆస్తులు ధ్వంసం చేశారని విమర్శించారు. రేపు రాయలసీమలో ఏముంటుందో తెలియదని పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పల్లా ఆస్తులు ధ్వంసం చేస్తారా? అని చంద్రబాబు అన్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పల్లా ఆస్తులు ధ్వంసం చేస్తారా?: చంద్రబాబు - జగన్పై చంద్రబాబు కామెంట్స్
జగన్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఇబ్బందులను మళ్లించేందుకు తెదేపాపై కక్షసాధింపు చర్యలకు దిగుతుందన్నారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పల్లా ఆస్తులు ధ్వంసం చేస్తారా?: చంద్రబాబు
TAGGED:
జగన్పై చంద్రబాబు కామెంట్స్