వైకాపా ప్రభుత్వం పూర్తిగా పక్షపాతంతో, కక్షసాధింపు చర్యలతో పని చేయడం మంచి పద్ధతి కాదని భాజపా నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భాజపా కార్యకర్తలపై వైకాపా దాడులకు దిగుతున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఏపీలోని సమస్యలపై భాజపా ఒంటరి పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
'మత మార్పిడి, రాజకీయ దాడులు సరికాదు' - విశాఖలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తాజా వార్తలు
రాష్ట్రంలో అన్యమత ప్రచారం జరుగుతోందని తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విశాఖలో పర్యటించిన ఆయన.. బలవంతపు మత మార్పిడి మంచిది కాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యకు దిగుతోందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
kishan reddy