డివైడర్ ఎక్కి లారీని ఢీకొని - volva bus
విశాఖలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం స్పష్టించింది. అదుపుతప్పి డివైడర్ ఎక్కి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. క్యాబిన్‌లో ఇరుక్కుపోయి ట్రక్కు డ్రైవర్ గంట సేపు నరకయాతన అనుభవించాడు.
విశాఖ నగరంలో ఇసుక తోట వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇసుకతోట వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఆపై డివైడర్ పై ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను ఢీకొట్టి ఆవతలి వైపు వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టినందున ట్రక్కు క్యాబిన్ తునాతునకలైంది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. దీంతో స్థానికులు డ్రైవర్‌ని గంట పాటు శ్రమించి బయటకు తీశారు. బస్సులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.