విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. ఒక అడుగు దిగిరావాలని ఎమ్మెల్సీ మాధవ్(mlc madhav on visakha steel plant) కోరారు. వైజాగ్ ఉక్కుపై అఖిల పక్షం ఏర్పాటు చేయాలన్న జనసేన ఛీప్ పవన్ కల్యాణ్ డిమాండ్‌ను స్వాగతిస్తున్నట్లు ఆయన ప్రకటించారు(MLC Madhav welcomes Janasena slogan on steel plant). ప్రతిపక్ష పాార్టీల ముఖ్యనేతలతో మాట్లాడి అఖిల పక్షానికి ఆహ్వానిస్తే భాజపా కూడా కలిసి వస్తుందన్నారు.
పరిశ్రమ కార్మికులు, నిర్వాసితుల సమస్యపై కేంద్ర మంత్రులతో మాట్లాడామని.. స్టీల్ ప్లాంట్‌కు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను మొత్తం ప్రైవేట్‌పరం చేసిందని.. దీనిపై కమ్యూనిస్టులు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు.. విశాఖ భూములు దోచుకుంటున్నారని మాధవ్ ఆరోపించారు(mlc madhav on visakha land mafia).