పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన తీరు గర్హనీయమని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశాఖ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఒక ప్రజా ప్రతినిధి పట్ల పోలీసులు ఏ రకంగా వ్యవహరించి కారులో బలవంతంగా తోశారో చూశామని... ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదన్నారు.
ఒక వ్యక్తి తప్పు చేశారని భావిస్తే చట్ట పరంగా, న్యాయ పరంగా చర్యలు తీసుకోవచ్చని వ్యాఖ్యానించిన ఆయన... ఎంపీ పట్ల ఈరకంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్నవారిని విమర్శించడం సమర్ధనీయమే అయినా...ఒక కులాన్ని మెుత్తం దూషించే విధంగా మాట్లాడటం సరికాదని మాజీ ఎమ్మెల్యే అన్నారు.