కోడెల మరణాన్ని రాజకీయం చేయటం సబబు కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమైనా.. లోతుగా విశ్లేషణ చేయటం ఈ సమయంలో సరికాదని విశాఖలో వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని ఆరోపించారు. ధర్నాలు, సమావేశాలను అనుమతించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆక్షేపించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విశాఖ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీటీసీ, సర్పంచులను కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: కన్నా - kanna laxmi naraayana
మాజీ స్పీకర్ కోడెల మృతికి కారణాలు ఏమైనప్పటికీ.. రాజకీయం చేయవద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా అన్నారు. మూడు నెలలకే సీఎం భయపడుతున్నారని... ధర్నాలు, సమావేశాలను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు.
కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: కన్నా