ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆలోచనలే పెట్టుబడిగా మారాలి: మంత్రి శ్రీనివాసరావు - campus placements

ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటిన అవంతి కళాశాల విద్యార్థులను రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. వివిధ సంస్థలో ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించారు.

మంత్రి శ్రీనివాస్

By

Published : Jul 20, 2019, 6:37 PM IST

అవంతి కళాశాలలో కార్యక్రమం

విశాఖలోని అవంతి కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటారు. 41 కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యులో మొత్తం 550 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. కంపెనీలు ఇచ్చిన నియామక పత్రాలను విద్యార్థులకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి మంత్రి అందజేశారు. నిర్థిష్టమైన లక్ష్యంతో ఆలోచనలనే పెట్టుబడిగా మార్చి విజయాలు సాధించాలని మంత్రి సూచించారు. కళాశాల యాజమాన్యం తోడ్పాటు వల్ల మంచి ఉద్యోగాలు సాధించినట్టు ఎంపికైన విద్యార్థులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details