విశాఖలో అఖిల భారత డ్వాక్రా మేళా ప్రారంభమైంది. ప్రతీ ఏట ఈ మేళాని నిర్వహిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రెండు వారాల పాటు సాగే ఈ ప్రదర్శన మహిళలు, నగర వాసులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారుల చేనేత, ఇతర ఉత్పత్తులను విక్రయానికి ఉంచారు. అలాగే బొమ్మలు, లోహవస్తువులు, కొయ్య వస్తువులు ఊరగాయలు, పచ్చళ్లు వంటి వాటిని మహిళా సంఘాలు అమ్మకానికి ఉంచాయి. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి స్టాళ్ల ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
విశాఖలో అఖిల భారత డ్వాక్రా మేళా ప్రారంభం
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అఖిల భారత డ్వాక్రా మేళా ప్రారంభమైంది. ప్రతి ఏటా జరిగే ఈ ప్రదర్శన నగర వాసులను ఎంతగానో ఆకట్టుకోనుంది. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి స్టాళ్ల ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/20-December-2020/9942426_dwakra.jpg