Heroine Pragya in CMR Shopping Mall : విశాఖ జిల్లా నర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో "అఖండ" హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ పాల్గొని సందడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాల్ ను లాంఛనంగా ప్రారంభించారు.
Heroine Pragya in CMR Shopping Mall : విశాఖ జిల్లాలో 'అఖండ' హీరోయిన్ సందడి - Narsipatnam cmr shopping mall
Heroine Pragya in CMR Shopping Mall: నర్సీపట్నంలో అఖండ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ మాల్ ను స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. నర్సీపట్న వ్యాపార పరంగా మంచి గుర్తింపు లభిస్తోందని అన్నారు. నర్సీపట్నంలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 350 మందికి ఉపాధి కల్పిస్తున్నామని సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు. ప్రగ్యా మాట్లాడుతూ.. సీఎంఆర్ కొత్త శాఖను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఈ అందాల భామ అఖండ సినిమాలోని పాటకు డాన్స్ చేసి అలరించారు.
ఇదీ చదవండి : RAIDS IN CINEMA THEATERS : సినిమా హాళ్లలో తనిఖీలు.. థియేటర్ల మూసివేత