ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sexual Harassment : లైంగికంగా వేధించిన ఏఈకి దేహశుద్ధి - Sexual harassment of women

తనను లైంగికంగా వేధించిన పై అధికారికి బాధితురాలు బుద్ధి చెప్పింది. అతని చర్యలకు విసిగిపోయిన ఆమె భర్త, యూనియన్ నాయకుల సహకారంతో నిలదీయడమే కాకుండా దేహశుద్ధి చేసింది. ఈ ఘటన విశాఖ జిల్లా చోడవరంలో జరిగింది.

Sexual Harassment
లైంగికంగా వేధించిన ఏఈకి దేహశుద్ధి

By

Published : Nov 17, 2021, 1:24 PM IST

లైంగికంగా వేధించిన ఏఈకి దేహశుద్ధి

విశాఖ జిల్లా చోడవరం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో బాధితురాలు జూనియర్ ఇంజినీర్​గా పని చేస్తోంది. అదే కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న రామలింగేశ్వరరావు కొంత కాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఏఈ అసభ్యకర చర్యలకు విసిగిన ఆమె.. తన భర్తకు, యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కార్యాలయంలోనే అందరూ కలిసి ఏఈని నిలదీశారు. కోపోద్రిక్తురాలైన బాధితురాలు వారి సమక్షంలోనే అతనికి దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.

ABOUT THE AUTHOR

...view details