ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఆందోళనకు దిగారు. 14 రోజుల కిందట ప్రభుత్వానికి, అరబిందో యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చినా స్పందించలేదంటూ నిరసన తెలిపారు. ఎన్నికలకు ముందు 108 సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరబిందో యాజమాన్యం తమను వేధిస్తోందన్నారు. డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె బాట తప్పదని హెచ్చరించారు.
'ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి'... లేదంటే సమ్మెకు సిద్ధం
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఆందోళనకు దిగారు. 14 రోజుల కిందట ప్రభుత్వానికి, అరబిందో యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చినా స్పందించలేదంటూ నిరసన తెలిపారు.
108 Employees statewide agitation